బిగ్ బాస్ నాలుగో సీజన్ అద్బుతంగా సాగుతోంది, అయితే ఈ సీజన్ లో సరికొత్త టాస్కులు ఇస్తున్నారు బిగ్ బాస్.. ఇప్పటికే 11 వారాలు పూర్తి అయింది.. ఇక మరో 4 వారాలు మాత్రమే మిగిలి ఉంది ..మిగిలిన ఏడుగురిలో ఎవరు హౌస్ లో ఈ వారం ఎలిమినేట్ అవుతారు అనే చర్చ జరుగుతోంది.. టాప్ 5 ఉంటారా లేదా చివరి వరకూ టాప్ 3 ఉంటారా అనేది చూడాలి..ఈ వారం నో ఎలిమినేష్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.
మరి బిగ్ బాస్ ఆట ఎప్పుడైనా ఎలాగైనా మారవచ్చు, అయితే తాజాగా హౌస్ లో ఈవారం జలజ అనే దెయ్యంఎంట్రీ ఇప్పించారు. షోలో ఇదే హైలెట్ అనే చెప్పాలి.. అన్నీ ఎపిసోడ్స్ కంటే ఇక్కడ అఖిల్ సోహైల్ అదరగొట్టారు డైలాగ్ లతో… బాగా బెదిరిపోయారు, కామెడి పండింది, అయితే మరి ఆమె వాయిస్ ప్రకారం ఈ జలజ ఎవరో తెలియడం లేదు.. కాని తాజాగా తెలిసింది అంటున్నారు అభిమానులు.
జలజగా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన దెయ్యం ఎవరో కాదు … సీజన్ 2లో కంటెస్టెంట్గా పాల్గొన్న తెలుగు హీరోయిన్ భానూ శ్రీ అని వార్తలు వినిపిస్తున్నాయి, అంతేకాదు ఈ వాయిస్ కోసం గీతా మాధురిని తీసుకున్నారు అని అంటుంటే, కాదు భాను వాయిస్ అని అందరూ అంటున్నారు , మరి చూడాలి దీనిపై ఈ వారం నాగ్ మాట్లాడే అవకాశం ఉంది.