తమిళ్ బిగ్బాస్ హౌస్ లో వర్షపు నీరు ఇంటి సభ్యులని ఏం చేశారంటే

తమిళ్ బిగ్బాస్ హౌస్ లో వర్షపు నీరు ఇంటి సభ్యులని ఏం చేశారంటే

0
103

బిగ్బాస్ తమిళ్ సీజన్ 4 జరుగుతోంది … అయితే ఈ షో కూడా అద్బుతంగా సాగుతోంది. హోస్ట్ గా కమల్ ఉన్నారు, ఈ సమయంలో నివర్ తుఫాన్ మాత్రం అక్కడ ప్రజలని వణికిస్తోంది, అయితే తాజాగా చెన్నై నగరంలో రెండు రోజులుగా భారీ వర్షం పడుతోంది.. రోడ్లు జలమయం అయ్యాయి, అంతేకాదు ఎక్కడ చూసినా వాగులు వంకలు నీటితో పొంగి పొర్లుతున్నాయి, అలాగే బిగ్ బాస్ కు కూడా ఈ వాన దెబ్బ తప్పలేదు అంటున్నారు చాలా మంది.

బిగ్బాస్ ఇంటిలోకి భారీగా వరద రావడంతో కంటెస్టెంట్లను మరో ప్రాంతానికి తరలించారని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే అక్కడ వరద నీరు రావడంతో వెంటనే వారిని ప్రముఖ హోటల్ కు తరలించారట, మళ్లీ సాయంత్రానికి అక్కడ హౌస్ లో వాటర్ ని మోటార్ల ద్వారా తోడించి హౌస్ లోకి తీసుకువచ్చారు అని తెలుస్తోంది.

చిన్న చిన్న రిపేర్లు పూర్తి చేశారట, అయితే ఇంత భారీ వర్షంలో కూడా కెమెరాలకు ఇబ్బంది కలగలేదు.. కాని వార్తలు ఇలా వినిపిస్తుంటే, ఇదంతా నిజం కాదని అందరూ హౌస్ లో ఉన్నారని ఎక్కడకు తరలించలేదు అని నిర్వాహకులు అంటున్నారట, మొత్తనికి ఈ వార్త తమిళనాట వినిపిస్తోంది.