నాగార్జున సినిమాకు భారీ ఆఫర్

నాగార్జున సినిమాకు భారీ ఆఫర్

0
103

మార్చి నెల చివరి నుంచి లాక్ డౌన్ అమలులో ఉంది .. ఈ సమయంలో.. దాదాపు 7 నెలలుగా సినిమా థియేటర్లు ఓపెన్ కాలేదు.. దీంతో చాలా ఇబ్బందుల్లో ఉంది చిత్ర పరిశ్రమ.. సినిమాలు షూటింగులు జరుపుకోలేదు, ఇక చాలా వరకూ పూర్తి అయిన సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకున్నాయి, కొన్ని ఓటీటీ బాట పట్టాయి, అక్కడ మార్కెట్లో రిలీజ్ అయ్యాయి.

ఈ సమయంలో నిర్మాతలను ఓటీటీ ఆదుకుంది. మంచి రేటు ఆఫర్ చేసి కొన్ని సినిమాలను ఆయా ఓటీటీ సంస్థలు సొంతం చేసుకున్నాయి. అయితే భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రం ఓటీటీకి వెళ్లకుండా థియేటర్ల కోసం ఎదురుచూస్తున్నాయి, తాజాగా నాగార్జున చిత్రం పై చర్చ టాలీవుడ్ లో జరుగుతోంది.

అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే చిత్రంలో నటిస్తున్నారు.ఎన్ఐఏ ఆఫీసర్ గా ఇందులో నాగ్ నటిస్తున్నారు, అయితే ఈ సినిమా ఇటీవల షూటింగ్ కూడా మనాలీలో పూర్తి చేసుకుంది, ఇక తాజాగా ఈ సినిమాకి
ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్ కోట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ చిత్రం ఓటీటీలో వస్తుందా లేదా థియేటర్ కి మెగ్గుచూపుతారా అనేది చూడాలి.