ఎఫ్ 3 ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు, ఈ సినిమా కాంబో సూపర్ హిట్ అనేది తెలిసిందే..హీరోలు వరుణ్ తేజ్ – వెంకటేష్ – దర్శకుడు అనిల్ రావిపూడితో సూపర్ సక్సెస్ గాఎఫ్2 తెరకెక్కింది. అయితే ఇప్పుడు ఎఫ్ 3 పై ఫోకస్ పెట్టారు అనిల్ రావిపూడి. అయితే తాజాగా ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు టాలీవుడ్ అనలిస్టులు.
దీనికి కారణం అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ భారీగా పెరగనుంది.. ఆయన సరిలేరు నీకెవ్వరుతో మంచి హిట్ లో ఉన్నారు..
ఇక వెంకటేష్ వరుణ్ కూడా ఎఫ్ 2 సక్సెస్ తో రెమ్యునరేషన్ పెంచారు అని టాక్ నడుస్తోంది, అయితే సాధారణ బడ్జెట్ తో ఎఫ్ 2 ఆనాడు సక్సెస్ అయింది..
కాని ఇప్పుడు మాత్రం ఎఫ్ 3 కి నిర్మాతలకు భారీ బడ్జెట్ అవుతుంది అంటున్నారు టాలీవుడ్ అనలిస్టులు…దిల్ రాజ్ ఎప్2ను డీసెంట్ బడ్జెట్తో ముగించారు….సో ఇప్పుడు కరోనా సమయం దీంతో బడ్జెట్ భారీగా పెట్టినా లాభాలు ఎలా వస్తాయో తెలియని స్దితి, ఓటీటీలో ఇంత భారీ బడ్జెట్ కు భారీ లాభాలు రావు. సో మరి చూడాలి ఎప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందో.