ఎక్కడైనా ఏ భాషలో అయినా సినిమా హిట్ అయింది అంటే అదే నేరేషన్ తో కథలో కాస్త మార్పులు చేసి రీమేక్ చేయడానికి చాలా మంది చూస్తారు.. కొన్ని దర్శకులు ఎంచుకుంటే, మరికొన్ని నిర్మాతలు హీరోలు కూడా ఎంచుకుంటారు.. ఇలాంటివి చాలా సినిమాలు వచ్చాయి అన్నీ భాషల్లో… అయితే మన తెలుగు సినిమాలు సూపర్ హిట్ అయినవి బాలీవుడ్ లో రీమేక్ కు రెడీ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు ఏమిటో చూద్దాం.
ఆకాశం నీ హద్దురా మూవీ బాలీవుడ్ లో రీమేక్ కానుంది. షాహిద్ కపూర్ ఇందులో నటించనున్నారట షాహిద్ అర్జున్ రెడ్డి సినిమా చేశారు. ఇక అలాగే షాహిద్ జెర్సీ నాని సినిమాని కూడా చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాని బాలీవుడ్ లో చేయనున్నారు దీనికి రణ్వీర్ సింగ్ పేరు వినిపిస్తోంది. అల వైకుంఠపురం సినిమాని హిందీలో కార్తీక్ ఆర్యన్ హీరోగా అల్లు అరవింద్ తెరకెక్కిస్తున్నారు. జులాయి సినిమాని హిందీలో మిథున్ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి చేయనున్నారు.
అనుష్క చేసిన అరుంధతి మూవీ ని అక్కడ దీపిక చేయనుంది అని వార్తలు వస్తున్నాయి… అలాగే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాని నవీన్ పొోలీశెట్టితోనే హిందీలో తీయనున్నారు… అలాగే డీజే దువ్వాడ జగన్నాథం సినిమాని బాలీవుడ్ లో సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా రీమేక్ చేసే ఛాన్స్ ఉంది.. అనుష్క భాగమతి చిత్రాన్ని హిందీలో దుర్గావతి పేరుతో భూమి పేడ్నేకర్ హీరోయిన్గా చేయనున్నారు.