ఎమ్మెల్సీ కవిత కామెంట్ పై బండ్ల గణేష్ స్ట్రాంగ్ రిప్లై

ఎమ్మెల్సీ కవిత కామెంట్ పై బండ్ల గణేష్ స్ట్రాంగ్ రిప్లై

0
89

బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో గత ఎన్నికల వేళ ఎలా క్యాంపెయినింగ్ చేశారో తెలిసిందే ..టీఆర్ ఎస్ ఓడిపోతుంది కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని అనేవారు, కాని ఆ ఎన్నికల్లో దారుణమైన ఓటమి తర్వాత ఏకంగా బండ్ల గణేష్ రాజకీయాలకే గుడ్ బై చెప్పారు. మనకు పడని రాజకీయాలు అని తెలిపారు, దీంతో సినిమాలతో తన ఫారం బిజినెస్ లో బిజీ అయ్యారు ఆయన..

ఇక ఇటీవల ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్ పై తాజాగా ఆయన రియాక్ట్ అయ్యారు,నేను జోకర్ని కాదు.. ఫైటర్ని.. కానీ ప్రస్తుతం ఎలాంటి రాజకీయ పార్టీలో ఉండదలచుకోలేదు. ఆల్ ది బెస్ట్ అని పేర్కొంటూ కవితకు ట్యాగ్ చేశారు. అయితే గతం గతః మరి ఇప్పుడు ఎందుకు ఆయనని ఈ రాజకీయాల్లోకి లాగడం అంటున్నారు గణేష్ అభిమానులు.

ఆ ఎన్నికలు వేరు ఈ ఎన్నికలు వేరు.. ఆయన తన వ్యాపారాలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి వేళ ఆయనపై కామెంట్స్ చేయకండి అని చెబుతున్నారు బండ్ల గణేష్ అభిమానులు, మొత్తానికి నెటిజన్లు మాత్రం బండ్ల గణేష్ చాలా సైలెంట్ గా సమాధానం చెప్పారని అంటున్నారు..తనకు రాజకీయాలతో సంబంధం లేదు అని ఇటీవల చాలా సార్లు ఆయన చెప్పిన విషయం తెలిసిందే.