పవన్ కల్యాణ్ ఓ పక్క సినిమాలతో బిజీగా ఉన్నా ఇటు రాజకీయంగా కూడా ప్రజల వెంట ఉంటున్నారు, అంతేకాదు ఏపీ తెలంగాణలో కూడా తన పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నారు, అయితే ఏపీలో తుఫాన్ ప్రభావం ఎలా ఉందో చూశాం.
తమిళనాడులో తీరం దాటిన నివర్ తుపాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపింది.
ఇక దాదాపు మూడు రోజుల పాటు దారుణంగా కుండపోత వర్షాలు కురిశాయి, అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున వాగులు వంకలు పొంగిపొర్లాయి రైతన్నకు భారీ విషాదం మిగిల్చాయి.లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
ఈ సమయంలో జనసేనాని కీలక నిర్ణయం తీసుకున్నారు.
డిసెంబరు 2న తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. నివర్ తుపాను ప్రభావిత జిల్లాల నాయకులతో పవన్ మాట్లాడారు, రైతులని పరామర్శించనున్నారు,
.చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. అక్కడ రైతులను కలిసి వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.