షూటింగ్ నుంచి మధ్యలో వెళ్లిపోయిన శ్రుతిహసన్ కారణం ఇదేనట

-

శ్రుతిహాసన్ బిజీ స్టార్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే, తెలుగు తమిళ సినిమాలతో ఈమె చాలా బిజీగా ఉంది..ప్రస్తుతం విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో ఎస్పీ జననాథన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న లాభం అనే తమిళ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా షూటింగ్ బ్రేక్ ఇచ్చారు, ఇటీవల షూటింగ్ ప్రారంభమైంది, అయితే ఇటీవల శృతి షూటింగ్ లో పాల్గొన్నారు.

- Advertisement -

కాని వెంటనే శ్రుతి సెట్స్ నుంచి వెళ్లిపోవడంతో అంతా షాక్ అయ్యారు, ఎందుకు అంటే అక్కడకు పెద్ద ఎత్తున షూటింగ్ చూసేందుకు జనం వచ్చారు. దీంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయారు, అయితే ఇలా ఆమె వెళ్లిపోవడంతో అక్కడ మీడియా సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపించాయి. దీంతో ఆమె క్లారిటీ ఇచ్చారు.

కరోనా వల్ల అందరికీ ప్రమాదం ఉందని అందుకే వెళ్లిపోయానని ఆమె తాజాగా వివరించి చెప్పింది. ప్రజలు దీనిని సాధారణంగా తీసుకుంటున్నారు అని అజాగ్రత్త వద్దు అని ఆమె చెప్పారు, మొత్తానికి అంత మంది జనం రావడంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయారు అనేది తెలిసింది, ఇక ఆమె చేసినదానిపై ఆమె అభిమానులు మీరు చేసింది కరెక్ట్ అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Union Cabinet | రైతుల శ్రేయస్సు కోసం కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు

ఆంగ్ల నూతన సంవత్సరం వేళ రైతుల కోసం కేంద్ర క్యాబినెట్(Union Cabinet)...

Hyderabad Metro | హైదారాబాద్ వాసులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

హైదరాబాద్ మహానగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా గుడ్...