తమిళ హీరో శింబు వరుస సినిమాలతో చాలా బీజీగా ఉన్న హీరో, ఏదైనా సినిమా వర్క్ స్టార్ట్ చేస్తే ఆ సినిమా అయ్యే వరకూ చాలా డెడికేషన్ తో ఉంటారు అని కోలీవుడ్ లో ఆయనకు మంచి పేరు ఉంది, ఇక లాక్ డౌన్ సమయంలో చిత్ర సీమలో చాలా మందికి ఆయన సాయం చేశారు.
లాక్డౌన్ సమయంలో భారీగా వర్కవుట్స్ చేసి 101 కేజీల నుండి 71 కేజీల వరకు తగ్గాడట. తనలోని మార్పు తనకే షాకిచ్చిందని అంటున్నాడు శింబు. ఇక ప్రస్తుతం ఈశ్వరుడు అనే సినిమా చేస్తున్నాడు, ఇది గ్రామీణ నేపథ్యం ఉన్న చిత్రం ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
శింబు తల్లి బ్రిటీష్ రేసింగ్ కారు మినీ కూపర్ను శింబుకు బహుమతిగా ఇచ్చారు. ఆయన కష్టాన్ని చూసిన ఆమె తన కుమారుడికి ఈ కారు ఇచ్చారు, ఈ కారు అంటే శింబుకి చాలా ఇష్టం, ఇక ఈ కారు 50 లక్షలు ఉంటుంది, ఇటీవల ఆయన దీపావళి సందర్భంగా 200 మంది జూనియర్ ఆర్టిస్టులకు బట్టలు పెట్టారు, అలాగే ఈశ్వరన్’ సినిమాకి పని చేసిన 400 మందికి ఒక గ్రాము బంగారు నాణెం ఇచ్చారు. ఇది దేశంలో పెను వైరల్ అయింది.