గర్భవతిగా ఉన్న సమయంలో మహిళలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.. ఆ సమయంలో కొన్ని రకాల ఫుడ్ మాత్రమే తీసుకోవాలి …అన్నీ రకాల ఫుడ్ తీసుకోకూడదు, మరీ ముఖ్యంగా కడుపులో బిడ్డకి కూడా బలం చేరాలి అని ఇలా అనేక రకాల మంచి ఆహారం అందిస్తారు. డ్రై ఫ్రూట్స్ అలాగే పళ్లు ఇలా ఎన్నో రకాల కూరగాయలు ఆకుకూరలు అందిస్తారు.
అయితే గర్భధారణ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో డెలివరీ తర్వాత కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక బాలింతల ఆరోగ్యం చాలా బాగా ఉండాలి లేకపోతే అది పిల్లలపై కూడా ప్రభావం చూపిస్తుంది.
తినే ఆహారం జీర్ణం అయ్యే ఆహారాలు తీసుకోవాలి బాలింతలు, మసాలా ఫుడ్ కు దూరంగా ఉండాలి.. పచ్చి బఠానీలు మాంసాలు ఇవి తినకూడదు, అలాగే చిప్స్ జంక్ ఫుడ్ చపాతీలు, పరోటాలు, తినకూడదు, మరీ ముఖ్యంగా కాఫీ టీ లకు దూరంగా ఉండాలి.బ్రకొలి కి కూడా దూరంగా ఉండాలి. పచ్చి బఠాని వేరుశనగ గింజలు వీటికి కూడా దూరంగా ఉండాలి.