రాశి హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేశారు ఆమె, టాప్ హీరోలు అందరితోనూ ఆమె నటించారు, బాలనటిగా తెలుగు చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా ఎదిగారు ఆమె, ఇక వరుసగా అవకాశాలు రావడంతో బిజీ హీరోయిన్ అయ్యారు తర్వాత ఆమెకి అవకాశాలు తగ్గాయి కీలక పాత్రలు చేస్తూ సినిమాల్లో కొనసాగారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని కీలక విషయాలు తెలిపారు ఆమె, రామ్ చరణ్ నటించిన రంగస్ధలం సినిమాలో ముందుగా రాశిని రంగమ్మత్త క్యారెక్టర్ కోసపం అడిగారట, అయితే, మోకాళ్ల పై వరకు చీర కట్టుకుని ఉండాలని… ఆ లుక్ తనకు సరిపోదని తాను ఒప్పుకోలేదని చెప్పారు. తర్వాత అనసూయకి ఈ అవకాశం దక్కింది సినిమాకి ఈ పాత్ర ఎంతో పేరు తెచ్చింది.
మహేశ్ బాబు నిజం సినిమాలో గోపీచంద్ పక్కన నెగెటివ్ పాత్ర చేయడం కూడా తప్పేనని అన్నారు.
అయితే దర్శకుడు తేజ నాకు మాత్రం గోపిచంద్ నువ్వు లవర్ అని చెప్పారు.. కాని తొలి రోజు పాత్ర చేశాక అర్దమైంది. ఇక తప్పుకుందాం అనుకున్నా, కాని సినిమా ఒప్పుకున్నాక మళ్లీ చేయను అంటే, చిత్ర సీమలో మళ్లీ బ్యాడ్ అవుతాము అని చేయాల్సి వచ్చింది అని తెలిపారు ఆమె.