పిండి కొద్ది రోట్టె అంటారు.. నిజమే డబ్బు కొద్ది సర్వీసులు.. నగదు బట్టీ సౌఖ్యాలు.. నగదు బట్టీ వస్తువులు ఉంటాయి, నిజమే ఈ స్టోరీ చదివితే అదే అనిపిస్తుంది, చాలా వరకూ బిలియనీర్లు కార్లు ఇళ్లు అన్నీ కోట్ల రూపాయల్లో ఉంటాయి. అయితే వారు వాడే బ్యాగులు కూడా అంతే ఖరీదు ఉంటాయి.
ఇటలీకి చెందిన బొలొగ్నా ప్రాంతంలో ఉన్న బోరిని మిలానేసి అనే బ్రాండ్ ఓ ఖరీదైన బ్యాగుని తయారు చేసింది.దీన్ని మొసలి చర్మంతో తయారు చేశారు. దీని స్పెషాలిటీ ఏమిటి అంటే, తెల్ల బంగారంతో చేసిన 10 సీతాకోక చిలుకలుతో దీనిని డిజైన్ చేశారు
వీటిలో 4 సీతాకోక చిలుకలపై ఖరీదైన మేలురకం వజ్ర వైఢూర్యాలున్నాయి.
దీని ఖరీదు ఏకంగా ఎంతో తెలిస్తే మతిపోతుంది, 53 కోట్ల రూపాయలు దీనిని వజ్రాలు బంగారంతో పూర్తిగా తయారు చేశారు. కాబట్టి ఇంత ఖరీదు…ఈ బ్యాగ్, సముద్ర కాలుష్యంపై అవగాహన పెంచడానికి డిజైన్ చేసినట్టు సంస్థ తెలిపింది. వీటని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును సముద్ర కాలుష్య నివారణకు ఉపయోగించనున్నట్టు సంస్థ తెలిపింది. సో దీనిని రిచ్ పర్సెన్స్ కొనడానికి రెడీగా ఉన్నారట.