ఈ రోజుల్లో సింపుల్ గా పెళ్లి చేసినా 5 లక్షలు ఖర్చు అవుతోంది.. ఇక ధనవంతుల పెళ్లి అంటే కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది, అయితే పెళ్లి చేయాలి అంటే తలకు మించిన భారం అనుకుంటున్నారు కొందరు అమ్మాయి తల్లిదండ్రులు, అయితే ఇప్పుడు కట్నాలు తీసుకునే వారు కొందరు ఉంటే కట్నాలు తీసుకోకుండా వివాహం చేసుకునే వారు కొందరు ఉంటున్నారు.
ఇక ఈ పెళ్లి కొడుకు గురించి చెప్పుకోవాలి, ఆదర్శ పెళ్లికొడుకు అని అందరూ కీర్తిస్తున్నారు ఈ వరుడ్ని,
ఈ ప్రభుత్వ ఉద్యోగి తన పెళ్లికి కట్నంగా కేవలం ఒక్క రూపాయి, ఒక్క కొబ్బరి బోండాంను మాత్రమే కట్నంగా తీసుకుని దేశానికే ఆదర్శంగా నిలిచాడు..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఈ వివాహం జరిగింది, మీ అమ్మాయి మా ఇంటికి వస్తే చాలు కట్నం వద్దు అన్నాడు, అయితే అమ్మాయి పేరెంట్స్ కట్నం ఇద్దాము అని భావించినా, అతను వద్దు అన్నాడు, ఇక అమ్మాయి కూడా అతని ఉన్నత ఆదర్శ భావాలకు ఎంతో సంతోషించింది.. వివేక్ కుమార్‌కు – ప్రియతో నవంబరు 30వ తేదీన వివాహం జరిగింది. అతను ఆర్మీలో జవానుగా పని చేస్తున్నాడు.