హైదరాబాద్ మహానగరంలో లగ్జరీ ఇళ్లకు కొదవలేదు అనే చెప్పాలి …జూబ్లిహిల్స్ బంజారా హిల్స్ నందిని హిట్స్ మణికొండ ఫిల్మ్ నగర్ గచ్చిబౌలి హైటెక్ సిటీ ఈ ప్రాంతాల్లో లగ్జరీ విల్లాలు హౌస్ లు కొన్ని వేలల్లో ఉన్నాయి, అయితే చాలా మంది సినీ రాజకీయ పారిశ్రామిక వేత్తల ఇళ్లు కోట్లలో ఉన్నాయి.
మన టాలీవుడ్ హీరోలు దర్శకులు నిర్మాతలు ఇక్కడ భారీ భవంతులు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే, తాజాగా మన టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ కూడా ఓ భారీ ఇంటిని తీసుకున్నారట,
ఇప్పుడు ఆయన ఉంటున్న సొంత ఇళ్లు కాకుండా . మరొక ఖరీదైన విల్లా ను కూడా కొనుగోలు చేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ రెమ్యునరేషన్ భారీగా పెరిగింది ..సినిమాకి 15 కోట్ల వరకూ పారితోషకం తీసుకుంటున్నారు. ఇక పుష్ప సినిమాకి భారీ రెమ్యునరేషన్ అందుతోంది అంటున్నారు టాలీవుడ్ పెద్దలు, ఇక కొత్త ఇంటి ధర సుమారు 11 కోట్ల వరకూ ఉంటుంది అని టాక్ నడుస్తోంది, ఇక ఈ ఇల్లు మహేష్ బాబు ఏఎంబి దగ్గర్లో అని తెలుస్తోంది.