మన భారతీయ చిత్ర సీమ దూసుకుపోతోంది అని చెప్పాలి ..కేవలం ఒక ప్రాంతానికి పరిమితం అయిన సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కు వెళుతున్నాయి …ఇక బాలీవుడ్ సినిమాలు కోలీవుడ్ టాలీవుడ్ సినిమాలు దేశం అంతా ప్రదర్శిస్తున్నారు, ప్రపంచ వ్యాప్తంగా డబ్ అవుతున్న చిత్రాలు ఉన్నాయి.
ఇక దర్శకుల మార్క్ ఎంతో ఉంటుంది అనే చెప్పాలి ఈ చిత్రాల్లో …బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో డబ్ అయింది, సో ఇప్పుడు కోలీవుడ్ లో ఇలాంటి దర్శకుల పేరు చెబితే శంకర్ ఆ తర్వాత ఎ.ఆర్.మురుగదాస్ పేరు వినిపిస్తుంది, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు ఎ.ఆర్.మురుగదాస్.
తాజాగా ఆయన హాలీవుడ్ సినిమా చేయనున్నారట.. హాలీవుడ్ లో భారీ నిర్మాణ సంస్థగా పేరున్న వాల్ డిస్నీ బ్యానర్లో మురుగదాస్ సినిమా చేయనున్నాడట. లైవ్ యాక్షన్ ట్రెండ్‌లో సినిమాను రూపొందించాలనేది మురుగదాస్ ఆలోచన, వచ్చే ఏడాది ఈ సినిమా తెరకెక్కనుంది.