అన్నమయ్యలో వెంకటేశ్వరుడి పాత్ర సుమన్ కంటే ముందు ఎవరిని అనుకున్నారంటే

-

అన్నమయ్య సినిమా తెలుగు సినిమా ఉన్నంత వరకూ గుర్తు ఉంటుంది.. చిరస్ధాయి సినిమా అనే చెప్పాలి ..అన్నమయ్యగా నాగార్జున నటన అమోఘం. ఆ వెంకన్న సాక్షాత్తు మన ముందు ఉన్నట్లే ఉంటుంది సుమన్ నటన, అందుకే వారిని ఇద్దరిని ఈ సినిమాకి రెండు రూపాలుగా చెబుతారు అందరూ, ఇప్పటికీ ప్రతీ ఇంటిలో ఈపాటలు వినిపిస్తూ ఉంటాయి.

- Advertisement -

రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘అన్నమయ్య శ్రీరామదాసు ఓంనమోవేంకటేశాయ శిరిడీసాయి ఈచిత్రాల్లో మన నాగార్జున నటించారు, వెంకటేశ్వరస్వామి కీర్తనలు రాసిన పరమ భక్తుడు అన్నమయ్యగా నాగార్జున నటిస్తాడని ప్రకటించినప్పుడు నిజంగా చాలా మంది ఆశ్చర్యపోయారట.

1997లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది, అన్నీ చోట్లా వంద రోజులు ఆడింది. అయితే ఈ చిత్రం గురించి ఓ వార్త వినిపిస్తోంది, ముందు అన్నమయ్య సినిమా అనుకున్న సమయంలో అన్నమయ్య పాత్ర కోసం నాగార్జునని ఒకే చేశారు.

వెంకటేశ్వరస్వామిగా ఎవరు నటిస్తారు అనేదానిపై చిత్ర యూనిట్ ఆలోచించారు, ఇక నాగార్జున ఈ చిత్రంలో కొన్ని సీన్లలో వెంకటేశ్వరస్వామి పాత్రధారి పాదాలపై పడాల్సిన సన్నివేశాలున్నాయి మరి అక్కినేని ఫ్యాన్స్ కు మనోభావాలు దెబ్బతినకూడదు, అందుకే ఆ రేంజ్ నటుడిని పెట్టాలి అని భావించారు.. అందుకే ముందు శోభన్ బాబుని ఈ పాత్ర కోసం అడిగారట, కాని ఆయన సినిమాల నుంచి రిటైర్డ్ అయ్యారు చేయను అన్నారు , సో తర్వాత సుమన్ ని ఆలోచించి ఆయనకు టెస్ట్ షూట్ చేస్తే ఆయనే పెర్ఫెక్ట్ అని ఆయన్ని ఫైనల్ చేశారు ఆయనకు మంచి పేరు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | తెలంగాణకు బీజేపీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది.. రేవంత్ రెడ్డి సెటైర్లు..

తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని...

Janasena | ఇప్పుడే నీ పేరు మార్చుకో.. ముద్రగడకు జనసేన నేత వార్నింగ్..

పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకంటానంటూ ముద్రగడ...