ఏపీలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది జగన్ సర్కారు, ఇప్పటికే గత ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్నీ హామీలు నెరవేరుస్తున్నారు, అంతేకాదు పెద్ద ఎత్తున నవరత్నాల హామీ పథకాలు అమలు పరుస్తున్నారు, ఇచ్చిన మాటకి కట్టుబడి అన్నీ పథకాలు అమలు చేస్తున్నారు, అయితే ఫించన్ల పై కూడా జగన్ సర్కారు క్లారిటీ ఇచ్చింది, వాస్తవానికి చూసుకుంటే జగన్ సర్కారు వచ్చిన తర్వాత చాలా మందికి కొత్త ఫించన్లు అందించారు.
చంద్రబాబు పాలనలో కంటే ఇప్పుడు జగన్ పాలనలో కొత్త పించన్లు పెరిగాయి.. సచివాలయాల ద్వారా కొత్త పించన్లు అప్లై చేసుకుంటే, వారు నిజంగా లబ్దిదారులు అయితే వారికి పించన్ అందిస్తున్నారు.. వృద్ధులకు పింఛన్ వయసును 65 నుంచి 60కు తగ్గించామని చెప్పారు.
మేనిఫెస్టోలో పింఛన్ పెంచుకుంటూ పోతామని చెప్పాం, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 2,250 పెంచామని.. జులై 8 దివంగత నేత వైఎస్సార్ జన్మదినం రోజున మరో రూ.250 పెంచుతాం..వచ్చే ఏడాది జూలై 8న 2500 పించన్ అందిస్తాము అని తెలిపారు ఆయన..టీడీపీ హయాంలో 44 లక్షల పించన్లు ఇచ్చారు కాని ఇప్పుడు వైసీపీ 61 లక్షల మందికి పించన్లు అందిస్తోంది.