మన దేశంలో ఎన్నో దేవాలయాలు గుడులు గోపురాలు ఉన్నాయి, అనేక ఆచారాలు వీటిలో పాటిస్తారు, అయితే ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రసాదం వితరణ ఉంటుంది, తిరుమల లడ్డూ ఎలా ఫేమస్ అలాగే అన్నీ దేవాలయాలకు అక్కడ ప్రసాదం కూడా ఉంటుంది, అయితే ఇక్కడ ప్రసాదం గురించి వింటే ఆశ్చర్యం కలుగుతుంది.
దేవాలయంలో ఎలుకలు తినగా మిగిలిన ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు భక్తులు. మరి ఎక్కడ అని అనుకుంటున్నారా రాజస్థాన్ లో తరతరాలుగా పాటిస్తున్నారు ఈ ఆచారం. రాజస్థాన్ లోని బికనీర్ సమీపంలో ఉన్న కర్నిమాతామందిరంలో ఎలుకలు తిని మిగిలిన ఆహారాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. అయితే ఎలుకలకి ఇక్కడ పాలు ప్రసాదంగా ఇస్తారు, అవి తాగిన తర్వాత మిగిలినవి భక్తులు తీర్దంగా తీసుకుంటారు, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
ఇక్కడ సుమారు ఎలుకల సంఖ్య పాతిక వేలు ఉంటుంది, కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ఇక్కడ కొలుస్తారు, ఇక్కడ కొన్నితెల్ల ఎలుకలు కనిపిస్తాయి, అలాగే కోరక తీరిన తర్వాత పాలు తెచ్చి ఇక్కడ ప్రసాదంగా ఇచ్చి మొక్కు తీర్చుకుంటారు..
గుడి ఆవరణలో తెల్ల ఎలుకలు కనిపిస్తే అత్యంత శుభసూచకమని ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్పుకుంటారు. ఇక్కడ ఎలుకలు ఎవరిని కరవవు.. ఇక్కడ ఎలుకలకి ఎవరూ హాని చేయరు.. సాక్షాత్తూ దుర్గా మాతనే ఇక్కడ శ్రీ కర్నిజీ మహరాజ్ గా అవతరించారని స్థల పురాణం చెబుతోంది.