జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో బిగ్ షాక్ తగిలింది… పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు… పార్టీలోకి చేరేందుకు వచ్చిన వెంకట్ రామ్ కు జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు…
కాగా 2019 ఎన్నికల్లో రాపాక జనసేన పార్టీ తరపున గెలిచిన సంగతి తెలిసిందే ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయన వైసీపీకి మద్దతుగా నిలిచారు… అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో వైసీపీ సర్కార్ చేస్తున్న కార్యక్రమాలపై ప్రశంశలు కురిపించారు…
రాపాక జనసేన పార్టీలో ఉంటూ వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేయడం గమనార్హం… కాగా సాంకేతికంగా జనసేనలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాపాక వరప్రసాద్ పార్టీ మారితే చిక్కులు రాకుండా ఉండేందుకు జనసేనలో కొనసాగుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి…