గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడిన సంగతి తెలిసిందే… ఆ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకోగా ఎవ్వరు ఊహించని విధంగా బీజేపీ చాపకింద నీరులా పాకి టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చింది…
ఇక కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని అందరు బావించారు కానీ ఆశించదగ్గ సీట్లను దక్కించుకోలేక పోయింది… ఇక టీడీపీ అయితే తన ఖాతాను తెరవలేకపోయింది… దీనిపై ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించారు ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు…
జీహెచ్ఎంసీ ఎన్నికలలో 106 స్థానాల్లో పోటీ చేస్తే దక్కింది సున్నా! కిందటిసారి తండ్రి కొడుకులు, మద్ధతుదారులైన సినీ నటులు ప్రచారం చేస్తే ఒక్కటంటే ఒక్కటి గెల్చారు. బాబు పార్టీ ఎగబాకుతుందో దిగజారుతోందో చెప్పడానికి ఈ ఫలితాలే సాక్ష్యం.ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగినా రిజల్ట్ ఇలాగే ఉంటుంది