మొత్తానికి మేయర్ పీఠం ఎవరికి వస్తుందా అనే చర్చ జరుగుతోంది గ్రేటర్ లో.. ఎవరికి ఫుల్ సపోర్ట్ గా సీట్లు దక్కలేదు.
ఎక్స్ అఫీషియో మెంబర్ల బలంతో టీఆర్ఎస్ పార్టీ లీడరే మేయర్ అవుతారు, కొన్ని సీట్లు కావాలి అయితే కచ్చితంగా ఎంఐఎం మద్దతు తీసుకునే ఛాన్స్ ఉంది, సో మేయర్ పదవి మహిళకు ఈసారి రానుంది.
మరి చాలా మంది పేర్లు వినిపించినా ఫలితాలు వచ్చిన తర్వాత ఒకరి పేరు వినిపిస్తోంది ..తాజాగా సింధు రెడ్డికే మేయర్ పదవి దక్కబోతుందని తెలుస్తోంది, భరత్ నగర్ లో పోటీ చేశారు సింధు ఆదర్శ్ రెడ్డి. ఆమె గెలవడం ఇది రెండోసారి.
ఆమెది పొలిటికల్ ఫ్యామిలీనే, మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కోడలు ఆమె. సీఎం కేసీఆర్ కి భూపాల్ రెడ్డికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మహిళా లీడర్ గా సింధు ఆదర్శ్ రెడ్డికి పేరుంది.
ఇక రెండోసారి ఆమె గెలవడంతో ఆమెకి ఛాన్స్ రానుంది, ఇక సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కి పిలిచారట కూడా. ఆమెతో చర్చించారు, మొత్తం అన్నీ చర్చించి పార్టీ నేతలతో మాట్లాడి ఆమెని ఫైనల్ చేయనున్నారు,త్వరలో దీనిపై ప్రకటన రానుంది.