బిగ్బాస్ సీజన్ 4 కి ఇక రెండు వారాలు మాత్రమే ఉంది, మరి ఈసారి ఎవరు ఫైనల్ కు వస్తారు అనే దానిపై చర్చ జరుగుతోంది.. సోషల్ మీడియాలో చాలా మంది అభిప్రాయాలు చెబుతున్నారు, అయితే ఈసారి విన్నర్ కు టైటిల్ ఇచ్చేది ఎవరు, అంతేకాదు సీజన్ 4 కి ఎవరిని స్సెషల్ గెస్ట్ గా తీసుకువస్తారు అనేది చర్చ జరుగుతోంది.
నాగార్జునకు తోడుగా ఆ డయాస్ మీద ఏ హీరో వస్తారు అనేది చర్చ.. అయితే చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి, గత సీజన్లో
ఫినాలేకి మెగాస్టార్ వచ్చి మెగా ఫినిషింగ్ ఇచ్చారు.. సెకండ్ సీజన్ కి వెంకటేష్ వచ్చారు, అయితే నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి ఈసారి.. ముందు ప్రభాస్ ని పిలవాలి అని భావించారు, తన తదుపరి సినిమా వర్క్ లో ఉన్నాడు ప్రభాస్.. లుక్ కూడా రివీల్ అవుతుంది అందుకే ప్రభాస్ రాకపోవచ్చు.
ఇక మహేష్ బాబుకి ఛాన్స్ ఉంది.. అయితే సర్కారువారి పాట సినిమా అమెరికాలో షూటింగ్ స్టార్ట్ అయితే ఆయన రాకపోవచ్చు, అయితే బన్నీ వచ్చే ఛాన్స్ ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. లేదంటే నాగ చైతన్య వీరిలో ఎవరో ఒకరు ఫినాలేకి వచ్చే అవకాశం ఉంది తాజాగా వస్తున్న వార్తల ప్రకారం..