వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా దూసుకుపోతున్నారు, అంతేకాదు పార్టీలో ముందు నుంచి ఉన్న నేతలకి కూడా సమయం వచ్చినప్పుడు పదవులు బాధ్యతలు అప్పగిస్తున్నారు, ఇక ఎమ్మెల్సీలుగా నామినేటెడ్ పదవులు ఇలా అన్నీంటిని భర్తీ చేస్తున్నారు.
ఈ సమయంలో కర్నూలు మాజీ ఎంపీ బుట్టారేణుకకి రాజకీయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక పదవి ఇవ్వాలి అని చూస్తున్నారట..బుట్టా రేణుక 2014 ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా నిలబడ్డారు, ఈ ఎన్నికల్లో ఆమె గెలుపొందారు తర్వాత ఆమె వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
తర్వాత ఎన్నికల వేళ మళ్లీ వైసీపీ గూటికి చేరారు, ఇక ఆమెకి టికెట్ దక్కలేదు, ఆమెకి వైసీపీ తరపున ఎమ్మెల్సీ పదవి వస్తుంది అని భావించారు అదిరాలేదు, తాజాగా ఆమెకి ఓ కీలక పదవికి అవకాశం ఇవ్వాలి అని చూస్తున్నారట.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న సమయం ఇది..ఈ సమయంలో కర్నూలు మేయర్ పీఠాన్ని బుట్టా రేణుకకు అప్పగించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి జిల్లాలో, బలమైన బీసీ మహిళానాయకురాలిగా ఈ అవకాశం ఇవ్వాలి అని చూస్తున్నారట.