రైల్వే ప్రయాణికులకి మరో సౌకర్యం, అంతేకాదు మీరు టికెట్ చేసుకున్న తర్వాత వెయిటింగ్ లిస్టు ఉన్నా మీ స్టేటస్ చూసుకోవాలి అన్నా పీఎన్ ఆర్ ద్వారా చూసుకుంటారు, అయితే ఇప్పుడు ఈ సర్వీసు వాట్సాప్ లో కూడా రానుంది, ఇక ఇప్పటి వరకూ అనేక వెబ్ సైట్లు లేదా రైల్వే సైట్ చూసి చెక్ చేసేవారు.. కాని ఇప్పుడు సరికొత్త సర్వీసు వచ్చింది.
ప్యాసింజర్ నేమ్ రికార్డ్ పీఎన్ ఆర్ స్టేటస్ ని తనిఖీ చేయడం.. ఇప్పుడు వాట్సాప్ ద్వారా చేసుకోవచ్చు..
Railofy ఈ సర్వీసు పేరు, మరి ఇది ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం.. వాట్సాప్లో +91 98811 93322 నంబర్కు మెసేజ్ పంపాలి.
తరువాత రైలు ఎక్కే ముందు మీ బుకింగ్ స్టేటస్, సీట్ల వివరాలను చూపుతుంది. మీకు సర్వీసు సమయం దాని రాక ఆలస్యం ఇలా అన్నీ వివరాలు పంపుతుంది, మీరు జస్ట్ మీ పీఎన్ ఆర్ నంబర్ పంపిస్తే మీకు అన్నీ డీటెయిల్స్ ఇందులో పంపించడం జరుగుతుంది.