కరోనా వైరస్ ప్రభావం చాలా రంగాలపై పడింది.. మరీ ముఖ్యంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు, ఇక సరుకు లేక కొన్ని వస్తువులు బ్లాక్ మార్కెట్ కు తరలిపోయి భారీ రెట్లు పెరిగాయి..ప్రజలపై కూరగాయల ధరల పెరుగుదల ప్రభావం చూపిస్తోంది, కొద్ది రోజులుగా వంట నూనెలు, రైస్ పచారీ సరుకులు భారీగా ధరలు పెరిగాయి, సేవింగ్స్ నగదు కూడా పెరిగిన రేట్లతో ఖర్చు చేయాల్సి వస్తోంది.
అయితే తాజాగా వీరికి గుడ్ న్యూస్ అంటున్నారు వర్తకులు, భారీగా పెరిగిన ఉల్లి తగ్గింది, అయితే ఇప్పుడు బంగాళాదుంప కూడా భారీగా పెరిగిన విషయం తెలిసిందే … ఇది కూడా వచ్చే వారం మరింత తగ్గనుంది..బంగాళాదుంప ధర కేజీకి రూ.50 పైనే ఉంది. అయితే వచ్చే రోజుల్లో ఎందుకు తగ్గుతుంది అంటే వెస్ట్ బెంగాల్ నుంచి బంగాళదుంప సరఫరా సోమవారం నుంచి మార్కెట్లకు రానుంది.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శీతల గిడ్డంగుల్లోని బంగాళదుంప స్టాక్ను మార్కెట్లోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది. వీటిల్లో ఇంకా 6-8 లక్షల టన్నుల సరుకు ఉంది. ఇక మార్కెట్లోకి ఇవి వస్తే భారీగా ధర తగ్గుతుంది. కిలో 30 కి తగ్గే సూచనలు ఉన్నాయి అంటున్నారు వ్యాపారులు. ఇక చింత పండు మిర్చి ఆనియన్స్ ధర కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది, బెల్లం మాత్రం కాస్త పెరుగుతుంది ఈనెల 20 నుంచి వచ్చేది పండుగ సీజన్ కాబట్టి.