రుక్మిణీ -శ్రీ కృష్ణులు ఒకరిని ఒకరు ఇష్టపడతారు, అయితే వివాహం చేయాలి అని పెద్దలు నిర్ణయిస్తారు. కాని ఈ వివాహం చేయడం ఇష్టం లేక రుక్మిణీ సోదరుల్లో ఒకరు అయిన రుక్మీ శిశుపాలుడు కిచ్చి తన చెల్లిని వివాహం చేయాలి అని భావిస్తాడు. కాని ఆమె ఒప్పుకోదు, ఎంతో బాధపడతుంది, ఈ విషయం శ్రీ కృష్ణుడికి చెప్పమని బాగాతెలిసిన
అగ్నిద్యోతనుడు అనే వ్యక్తికి చెబుతుంది.
అతను కిట్టయ్యకు ఈ విషయం చెబుతాడు, పెళ్ళి కుమార్తె పాణిగ్రహణానికి ముందు పొలిమేరలలో ఉన్న దేవాలయానికి గౌరీ పూజకు వస్తుంది. ఆ సమయములో కృష్ణుడు ఆమెని తీసుకురావాలి అని పథకం వేస్తాడు. ఈ సమయంలో ఆమె పూజ ముగించుకుని వస్తున్న సమయంలో.
శ్రీకృష్ణుడు ఆమెని తన రథం మీద ఎక్కించుకొని హుటాహుటిన ద్వారక వైపు బయలుదేరతాడు.
అక్కడ కొందరు అడ్డుకోబోతారు వెంటనే బలరాముడు మొదలైన వీరులు ఆ రాజులను చెల్లాచెదురు చేశారు.
కాని రుక్మి తన సోదరిని తీసుకువెళ్లద్దు అని దూకుడుగా వెళ్ళి శ్రీకృష్ణుడి రథం ఎదురుగా నిలిచి పోరాటం చేస్తాడు.
శ్రీకృష్ణుడు ఒక్క బాణం విసిరి వాడి ధనుస్సు ఖండించడానికి ప్రయత్నిస్తాడు, కాని రుక్మిణీ మాత్రం నా సోదరుడ్ని చంపొద్దు అని బ్రతిమాలుతుంది…శ్రీకృష్ణుడి కాళ్ళపై పడి తన సోదరుడిని క్షమించి విడిచి పెట్టమంటుంది. శ్రీకృష్ణుడు శాంతించి రుక్మికి తల గొరిగించే సన్మానం చేస్తాడు. తర్వాత ద్వారాకకు ఆమెతో వెళతాడు