బిగ్ బాస్ రియాల్టీ షో గతంలో కంటే ఈసారి భారీగా ప్రేక్షకుల ప్రేమని పొందింది అని చెప్పాలి.. అందరూ కొత్తవారు అయినా బిగ్ బాస్ చూసే వారు మాత్రం ఇప్పుడు వీరికి ఫ్యాన్స్ అయ్యారు.. ముఖ్యంగా అభిజిత్ సోహైల్ కి చాలా వరకూ అందరూ వారి ఆటతో ఫిదా అవుతున్నారు.. కద వేరే ఉంటుంది అంటూ సోహైల్ బాగా కనెక్ట్ అయ్యాడు..
ఇక అభి మాట ఆటతో మైండ్ గేమ్ తో బాగా కనెక్ట్ అయ్యాడు, అయితే ఇక మిగిలింది కేవలం రెండు వారాలు.. ఈవారం చివరి నామినేషన్లు సో ఇక ఈ వారం ఒకరు బయటకు వెళితే మిగిలేది ఐదుగురు ఇంటి సభ్యులు.. వీరి మధ్య హౌస్ లో టాస్క్ లు ఉంటాయి, ఫైనల్ గా ఎవరికి ఓటింగ్ వస్తుందో అనేది చూడాలి…
బిగ్ బాస్-4 హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ, ఈసారి బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే అత్యంత ఆసక్తికరంగా ఉండబోతోందని అన్నారు. దీంతో ఫైనల్ కి ఎవరు వస్తారా అనే ఆసక్తి అందరిలో పెరిగిపోయింది.
బిగ్ బాస్ షోకు 4 కోట్ల వ్యూస్ లభించాయని తెలిపారు నాగ్ గత వారం.. ఇక సెప్టెంబర్ ఆరున స్టార్ట్ అయింది షో.. మరి ఇంకో రెండు వారాలు మాత్రమే ఉంది..ఈసారి డ్యాన్సులు సాంగులతో ఫైనల్ సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు, మరి ఫైనల్ కు ఎవరు వచ్చి ఫ్రైజ్ మనీ ఇస్తారో చూడాలి, మీ అభిప్రాయం ఎవరైతే బాగుంటుంది కామెంట్ చేయండి.