మెగా డాటర్ నిహారిక పెళ్లికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.. మెగా కుటుంబం అందరూ ఇప్పటికే రాజస్ధాన్ లోని ఉదయ్ పూర్ చేరుకున్నారు, డిసెంబర్ 9 రాత్రి 7 గంటల 15 నిమిషాలకు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి జరుగనుంది.. చిరంజీవి రామ్ చరణ్ కుటుంబం ఒక ప్రత్యేక విమానంలో వచ్చారు, అల్లు వారి కుటుంబం కూడా సొంత విమానంలో వచ్చారు.
సాయి ధరమ్ తేజ్ కుటుంబం మరో విమానంలో వచ్చారు. అయితే పవన్ కల్యాణ్ వస్తారా రారా అని అందరికి అనుమానం ఉండేది.. అయితే తాజాగా పవన్ కల్యాణ్ ఉదయ్ పూర్ చేరుకున్నారు.
ఈరోజు మధ్యాహ్నం ఒక ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ పెళ్లి వేడుకకు చేరుకున్నాడు.
ఇక మూడు రోజులు పవన్ అక్కడ ఉండనున్నారు, ఇక ఆయనకు సంబంధించి అన్నీ ఏర్పాట్లు చేశారు
నిహారిక కోసం ఖరీదైన గిఫ్ట్ కూడా తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్. దాదాపు కోటి రూపాయలు విలువైన డైమెండ్ నగలు కూడా ఇస్తున్నారట. ఇటు రేణుదేశాయ్ పిల్లలు వస్తున్నట్లు తెలుస్తోంది.