బాలయ్యతో మరో కొత్త సినిమా ప్రముఖ నిర్మాత క్లారిటీ

-

ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ టాలీవుడ్ లో ఏ నాటి నుంచో ఉన్న ప్రముఖ నిర్మాత, ఇక బాలయ్యకు బాగా సన్నిహితుడు, తాజాగా ఆయన బాలయ్య తో మరో సినిమా చేయనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి… పరమవీర చక్ర- జై సింహా- రూలర్ ఇలాంటి భారీ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ తాజాగా మరో చిత్రం సెట్స్ పై పెట్టాలి అని చూస్తున్నారు. నేరుగా ఈ విషయం ఆయనే తెలిపారు.

- Advertisement -

బాలకృష్ణగారు మా సంస్థను సొంత సంస్థగా భావిస్తారు. నేను కూడా వాళ్ల ఇంట్లో నిర్మాతగా ఫీలవుతాను. ఇక ఆయనతో సినిమా అంటే ఎంతో కంఫర్టుగా ఉంటుంది, త్వరలోనే మా కాంబినేషన్లో సినిమా వస్తుంది అని చెప్పారు కల్యాణ్. రానా, సత్యదేవ్, రెజీనాలతో నిర్మించిన 1945 లవ్ స్టోరీ కూడా రిలీజ్ ఆగింది, ఈ కరోనా లాక్ డౌన్ వల్ల, త్వరలో దీనిపై క్లారిటీ ఇస్తాము అన్నారు.

సత్యదేవ్ హీరోగా గోపీ గణేశ్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించనున్నామనీ, ఫిబ్రవరిలో ఇది సెట్స్ కి వెళుతుందని తెలిపారు. కే ఎస్ రవికుమార్ తో కూడా ఓ సినిమా చేస్తున్నాము అని తెలిపారు, మొత్తానికి బాలయ్య సినిమా వచ్చే ఏడాది సెట్ పైకి వెళ్లనుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...