సినిమాల్లో పవన్ కల్యాణ్ కి ఉండే క్రేజ్ అందరికి తెలిసిందే , అయితే తాజాగా ఆయన కుమారుడు అకిరా పవన్ కల్యాణ్ ఇప్పుడు నిహారిక వివాహంలో సందడి చేశారు, ఈ సమయంలో వారిద్దరిని చూసిన పవన్ అభిమానులు మెగా ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు, ఎప్పుడు అకిరాని సినిమాల్లోకి తీసుకువస్తారు అని ప్రశ్నిస్తున్నారు, అయితే తెరవెనుక అన్నీ వర్కులు జరుగుతున్నాయట.
మెగాస్టార్ తర్వాత ఆ రేంజ్ పేరు వచ్చింది పవన్ కల్యాణ్ కే, మరి ఆయన కుమారుడికి కూడా ఆ పవర్ ఉంటుంది, సో అందుకే మంచి మాస్ స్టోరీ చూడాలి అని చూస్తున్నారు, కమర్షియల్ గా బడ్జెట్ ఎక్కువైనా సరే వెండితెరపై సూపర్ కథతో తీసుకురావాలి అని అకిరా గురించి ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా టాలీవుడ్ మెగా కాంపౌండ్ నుంచి వచ్చే వార్తల ప్రకారం దిల్ రాజు ఇటు చిరుకి మెగా కుటుంబానికి బాగా కావలసిన వ్యక్తి… పవన్ కల్యాణ్ కి కూడా మంచి సన్నిహితుడు, సో ఆయన లేదా మెగా కుటుంబంలో అల్లు అరవింద్ చేత అయినా సినిమా నిర్మించాలి అని ప్లాన్ చేస్తున్నారట, 2022 లో కచ్చితంగా అకిరా వెండితెరపైకి వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు.