సినీ నటుడు సోను సూద్ ఈ లాక్ డౌన్ సమయంలో ఆయన చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు.. ఎంతో మందిని తమ సొంత గ్రామాలకు పంపేందుకు సాయం చేశాడు, అంతేకాదు సొంతంగా వాహనాలు విమాన టిక్కెట్లు రైలు టిక్కెట్లు ఏర్పాటు చేశారు వలస కార్మికులకి , అలాగే వారికి నగదు సాయం చేశాడు, లేదు అని ఎవరు అడిగినా కర్ణుడిగా సాయం చేశాడు.
అయితే తాజాగా ఆయన విద్యార్దులకి కూడా ఎంతో సాయం చేశాడు, సినిమాల్లో విలన్ అవ్వచ్చు కాని సోనూ సూద్ రియల్ లైఫ్ లోమాత్రం హీరో అనే చెప్పాలి, ఈ లాక్ డౌన్ టైమ్ లో ఆయన సేవలు ఎవరూ మర్చిపోలేరు, వలస కార్మికులు వేలాది మందికి సాయం చేసిన గొప్ప వ్యక్తి,
ప్రజలకు సాయం చేయడం కోసం సోను తన ఆస్తులను కూడా తాకట్టు పెట్టారట. దాదాపు రూ. 10 కోట్లను పోగు చేయడం కోసం ముంబైలో తనకు గల ఎనిమిది ఆస్తులను ఆయన తాకట్టు పెట్టారు. ఇందులో ఆరు ఫ్లాట్లు, రెండు దుకాణాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి, నిజంగా ఆయనకు అంత గొప్ప మనసు ఉంది అంటున్నారు అభిమానులు.