టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి అంత ఎక్కువగా బయట కనిపించరు.. సినిమా ఫంక్షన్లు షూటింగుల సమయంలోనే కనిపిస్తారు, తాజాగా ఆమె పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం విచ్చేశారు. పోలవరంలోని మహా నందీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనుష్క.
ఆమెకి బాగా తెలిసిన వారు చిత్ర సీమలో ,బాహుబలి చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేసిన ప్రశాంతి త్రిపురనేని, మరో స్నేహితురాలితో కలిసి అనుష్క పోలవరంలో సందడి చేశారు. అయితే కరోనా సమయంలో జాగ్రత్తలు తీసుకుని ఆమె ఈ గుడికి వెళ్లారు, ఫేస్ మాస్క్ పెట్టుకోవడంతో బయట ఎవరూ గుర్తు పట్టలేదు.
స్నేహితులతో కలిసి అనుష్క గోదావరి నదిలో బోటులో షికారు చేశారు. అయితే ఇక్కడ ఎవరూ గుర్తు పట్టలేదు, అదే ఆమె మాస్క్ తీసేసి సాధారణంగా వచ్చి ఉంటే వేల మంది అభిమానులు అక్కడకు వచ్చేవారు.. మొత్తానికి ఆమె ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరి ఆ గోదావరిలో బోటుపై అనుష్క వెళుతున్న వీడియో చూసేయండి
పట్టిసీమ ప్రాంతంలో ఉన్న నందీశ్వర స్వామి దేవాలయం సందర్శించి స్వామి వారిని దర్శించుకున్న అనుష్క శెట్టి. #AnushkaShetty #NandeeswaraSwamyTemple pic.twitter.com/LHOkIvJTol
— Rajesh Manne (@rajeshmanne1) December 9, 2020