బిగ్ బాస్ సీజన్ 4 కి మరో రెండు వారాలు మాత్రమే టైం ఉంది.. ఈ సమయంలో తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకి ఓటింగ్ చేస్తున్నారు అభిమానులు, అయితే ఇప్పుడు హౌస్ లో సోహైల్ గురించి చర్చ జరుగుతోంది, ఏకంగా త్యాగమూర్తిగా మారి అఖిల్ ని రేస్ టు ఫినాలేకి వెళ్లేలా చేశాడు, ఇక ఈ వారం అతను సేవ్ అవుతాడు అనేది తెలుస్తోంది.
అయితే అమ్మాయిల విషయంలో హౌస్ లో అందరితో చాలా సరదాగా ఉంటూ సిస్టర్ అంటాడు.. కాని సోహైల్ అలా కాదట, బయట అమ్మాయిలతో బాగానే ఉంటాడట.. అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేస్తాడని సోహైల్ మరదలు చెబుతోంది..చూడ్డానికి స్మార్ట్గా ఉండటంతో అమ్మాయిల్ని ఈజీగానే ఫ్లర్ట్ చేస్తాడని చెప్తోంది సొహైల్ మరదలు.
తన బావ గురించి అనేక విషయాలు చెబుతోంది సోహైల్ మరదలు, ఇంట్లో ఎలా ఉన్నాడో అక్కడ అలాగే ఉన్నాడు, అలాగే కోపం వస్తుంది అని బావ గురించి చెబుతోంది ఆమె. అతని కోపం అంటారా క్షణాలు మాత్రమే.. మనసు వెన్నలాంటిది అని బావ గురించి చెబుతోంది.సొహైల్కి హౌస్లో ఉన్నవాళ్లు ఎవరైనా కనెక్ట్ అవుతారా అని చూశాం, కాని అతను ఎవరిని అలా చూడలేదు అనుకుంటున్నాం అని తెలిపింది ఆమె.