వచ్చే ఏడాది వ్యాక్సిన్ ఇయర్ అనే చెప్పాలి.. అనేక దేశాల్లో ప్రయోగాలలో ఉన్న వ్యాక్సిన్లు వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రజలకు ఇవ్వనున్నారు, ఇవన్నీ మార్కెట్లోకి రానున్నాయి, అయితే ఈ వ్యాక్సీన్లు తీసుకునే వారు కొన్నిజాగ్రత్తలు నియమాలు పాటించాలి అని చెబుతున్నారు వైద్యులు, మరీ ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకునే వారికి సీరియస్ హెచ్చరిక చేస్తున్నారు.
మందు బాబులకు ఓ బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రెండు నెలల పాటు ఎలాంటి మద్యపానాన్ని తీసుకోరాదట… బీరు నుంచి లిక్కర్ ఏదీ కూడా తీసుకోకూడదు, అంతేకాదు సాఫ్ట్ డ్రింకులు అతిగా తీసుకునే వారు కూడా దీనికి కాస్త దూరంగా ఉండాలి.
దీనిపై రష్యా అధికారులు హెచ్చరిస్తున్నారు అక్కడ ప్రజలకి .. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు నెలల పాటు మద్యపానానికి దూరంగా ఉండాలని తమ దేశ పౌరులను హెచ్చరిస్తున్నారు అధికారులు. స్పుత్నిక్ వి కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు కచ్చితంగా 48 రోజులు ఈ నియమాలు పాటించాల్సిందే.. సో మిగిలిన దేశాల్లో కూడా ఇలానే ఉంటుంది అంటున్నారు వైద్యులు.