వక్క మనకు శుభకార్యాల సమయంలో దేవుడి పూజల సమయంలో దీనిని ఎక్కువగా వాడుతూ ఉంటాం, అయితే దీని నుంచి మంచి లాభం ఉంటుంది అంటున్నారు రైతులు.. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం, రొళ్ల, అగళి మండలాలలో ఎప్పటి నుంచో వీటిని పెంచుతున్నారు, వక్క తోటలు ఇక్కడ ప్రసిద్ది. మన ఏపీలో దాదాపు ఇక్కడ 10 వేల ఎకరాల్లో సాగు ఉంటుంది.
ఒకసారి ఈ వక్క తోట మీరు వేస్తే మంచి లాభాలు వస్తాయి, ఎక్కువ కాలం లాభాలు ఇస్తుంది పెట్టుబడి ఒక్కసారి మాత్రమే, అయితే ఈ పంట పెట్టాలి అంటే మీకు మంచి నీరు పుష్కలంగా ఉండాలి, ఒక ఎకరా పొలంలో సుమారుగా 500 వక్క చెట్లను నాటవచ్చు.. ఒకసారి మీరు మొక్కనాటితే దాదాపు ఐదు సంవత్సరాల వరకూ దీని ఎదుగుదల పిరియడ్ ఉంటుంది.
రెండేళ్ల తర్వాత పంట చేతికి వస్తూ ఉంటుంది, ఇక దాదాపు రెండు లక్షల వరకూ లాభం వస్తుంది. తక్కువ ఎరువులు రసాయనాలు మాత్రమే వాడతారు. తక్కువ పెట్టుబడితో ఎక్కుల లాభం ఆర్జించవచ్చు అంటున్నారు రైతులు సంఘాల వారు, మీరు దీనిపై ఆలోచించండి.