ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే తాను ఉన్నాను అని ముందుకు వస్తారు మెగాస్టార్ చిరంజీవి.. తన అభిమానులు అందరిని కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు, తాజాగా ఆయన అభిమాని కుటుంబానికి సాయం చేసి తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు.. మహబూబ్నగర్కు చెందిన ఓ పేద అభిమాని కుమార్తె పెళ్లి కోసం రూ.లక్ష ఆర్థిక సాయం ఇచ్చి తన గొప్ప మనసుని చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.
మహబూబ్నగర్కు చెందిన బోనగిరి శేఖర్ గత 30 సంవత్సరాలుగా చిరంజీవికి వీరాభిమాని…ఆయన పేరు మీద అనేక కార్యక్రమాలు చేసేవాడు, అయితే ఇటీవల తన కుమార్తెకు వివాహం నిశ్చయం అయింది, కాని వివాహం సమయం దగ్గరకు వస్తోంది కాని నగదు మాత్రం ఏర్పాటు కాలేదు, దీంతో ఎంతో ఇబ్బంది పడ్డాడు,
ఈ విషయాన్ని చిరంజీవి అభిమాన సంఘం వారు ఆయన వద్దకు తీసుకువెళ్లారు, ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ అతనికి 1 లక్ష రూపాయల చెక్ పంపించారు. పేద అభిమాని కూతురి పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి చేసిన సాయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు, నిజంగా ఇది ఎంతో గొప్ప మనసుతో చేసిన పని అని అంటున్నారు అందరూ.