అంబానీ కుటుంబంలోకి బుల్లివారసుడు వచ్చాడు – తాతయ్య అయిన ముఖేష్ అంబానీ

-

అంబానీ కుటుంబం నుంచి ఎంతో ఆనందకరమైన వార్త వెల్లడించారు..నీతా- ముఖేష్ అంబానీ దంపతులు బామ్మ- తాతయ్యలుగా ప్రమోషన్ పొందారు. వారి పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ తండ్రి అయ్యారు, ఆయన భార్య శ్లోకా మెహతా పండండి బిడ్డకు జన్మనిచ్చారు.

- Advertisement -

శ్లోకా మెహతా ముంబైలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ మేరకు అంబానీ కుటుంబం గురువారం ప్రకటన విడుదల చేసింది. ఆ కృష్ణుడి ఆశీస్సులతో శ్లోకా- ఆకాశ్ అంబానీ తల్లిదండ్రులు అయ్యారు అని వారికి మగబిడ్డ పుట్టాడు అని తెలిపారు,ముఖేష్ అంబానీ తాతయ్య అయ్యారు,

ధీరూభాయి- కోకిలాబెన్ మునిమనవడికి స్వాగతం పలకడం పట్ల వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. వారి ఇంటికి కొత్త వారసుడు రావడంతో ఎంతో ఆనందంలో ఉన్నారు,గతేడాది మార్చిలో ఆకాశ్- శ్లోకాల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.. శ్లోకా మెహతా వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Akhilesh Yadav | దేశ గౌరవాన్ని విస్మరించేలా సీఎం మాటలు

కుంభమేళా నిర్వహణలో లోపాలున్నాయంటున్న ప్రతిపక్ష నేతలను పందులు, రాబందులతో పోల్చారు ఉత్తర్‌ప్రదేశ్...