బిగ్ బాస్ 4 ఇక రెండు వారాలు మాత్రమే ఉంది …అంటే ఈ శని ఆదివారాలతో వీకెండ్… వచ్చే వారం గ్రాండ్ ఫైనల్ జరుగనుంది, ఇక వచ్చే వారం ఎవరు ఫైనల్ కు అనేది తేలిపోతుంది, అయితే మరి ఈసారి హౌస్ లో విజేత ఎవరు అంటే.. చాలా మంది చెప్పేది అభిజిత్ పేరు, మరి అతను అందరికి బాగా నచ్చాడు అతని ఆట మాట విధానం అన్నీ నచ్చాయి, మరి తాజాగా అభిజిత్ కు పోటీగా ఇద్దరు ఉన్నారు వారు సోహైల్ అఖిల్.
అయితే ఈసారి సీజన్ 4 గ్రాండ్ ఫైనల్ కు ఎవరు రానున్నారు గెస్ట్ గా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది, ఈ సమయంలో పవర్ స్టార్ లేదా బన్నీ మహేష్ బాబు పేర్లు వినిపిస్తున్నాయి, ఇంకా దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు, అయితే సారి ఫ్రైజ్ మనీ ఎంత ఉంది అనేది మరో చర్చ జరుగుతోంది …ఈసారి సీజన్ లో ఫ్రైజ్ మనీ తక్కువ ఇస్తారు అని ఈ మధ్య వార్తలు వచ్చాయి.
టైటిల్ గెలిచిన వాళ్లకు 50 లక్షలు వస్తుంది. దీనికి ట్యాక్సుల పోను మిగిలిన అమౌంట్ వారికి అందిస్తారు, అంతేకాదు వారు హౌస్ లో ఉన్న 15 వారాలకు గాను వారితో ఎంత మేరకు ఒప్పందం చేసుకున్నారో ఆ నగదు కూడా చెక్ రూపంలో అందిస్తారు, ఈ వారం మొత్తానికి ఫైనల్ 5 ఎవరో తెలుస్తుంది, మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఎవరు ఫైనల్ లో విన్నర్ అవుతారో.