ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాసు ఇంట్లో విషాదం జరిగింది, ఆయన సోదరుడు గవర సురేష్ శుక్రవారం రాత్రి మరణించారు, ఆయనకు వివాహం అయింది ఆయనకు భార్య ఓ కుమారుడు ఉన్నారు, పాలకొల్లుకు చెందిన బన్నీ వాసు చిత్ర సీమలో ఎంతో గుర్తింపు పొందారు.
సురేష్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. డీజిల్,పెట్రోల్తో నడిచే ఫోర్ వీలర్ వెహికల్స్కు సీఎన్జీకంప్రెసర్,నేచురల్ గ్యాస్ కన్వెర్షన్ కిట్స్ అందించే కంపెనీని కూడా స్థాపించారు. అతి తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించుకుంది కంపెనీ. దేశంలో టాప్ 5 ఇంజనీర్లలో ఆయన ఒకరు.
ఇక బన్నీ వాసు పాలకొల్లుకు చెందిన వ్యక్తి ఆయన తండ్రి గవర సూర్య నారాయణ, ఆయనకు ఇద్దరు కుమారులు ఓ కుమార్తె ఉన్నారు, ఫ్యామిలీ అంతా బాగా స్ధితిమంతులే.. ఇటు బన్నీవాసు చిత్ర సీమలో నిర్మాతగా ఎంతో పైకి వచ్చారు, ఇలాంటి వేళ తన అన్న మరణం బన్నీ వాసు కుటుంబంలో విషాదం నింపింది.