సోమవారం సంపూర్ణ సూర్య గ్రహణం ఉదయం 7.03 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.23 గంటలకు ముగుస్తుంది..
సూర్యుడు, భూమి మధ్యకు చంద్రుడు రాబోతున్నాడు. దీంతో సూర్య కిరణాలు భూమిపై పడటం మానేస్తాయి.మనకు ఇది అంత ప్రభావం లేకపోయినా పాక్షికంగా ఉంటుంది, అయితే దీనిని పాటించేవారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ సూర్య గ్రహణం ప్రత్యేక కళ్లద్దాలు వాడి వీక్షించాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎవరైనా సరే సూర్యగ్రహణానికి ముందే ఆహారం తినాలి. ఇక గర్భవతులు కూడా ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ గ్రహణ సమయంలో బయటకు రావద్దు, అంతేకాదు ఆ నీడ గర్భంపై పడకుండా చూసుకోవాలి.
ఇంట్లో పూజ గది ఉంటే దానిపై కూడా సూర్యగ్రహణం నీడ పడకుండా ఇంటి తలుపులు, కిటికీలు మూసివేయాలి. దర్భగడ్డి వేసి ఆహారాలు ఉంచాలి, గ్రహణం అయ్యాక వంట చేసుకుంటే మంచిది, ఉదయం వంట చేయకుండా మధ్యాహ్నం వండి తీసుకోవాలి, ఇక తలస్నానం గ్రహణ పట్టు విడుపుకి కచ్చితంగా చేయాలి, పేదలకు నగదు బట్టలు వెండి సాయం చేస్తే గ్రహణం విడిచిన తర్వాత చాలా మంచిది. గ్రహణ సమయంలో అస్సలు నిద్రపోకూడదు. గ్రహణ సమయంలో ఎలాంటి మొక్కలు అస్సలు తెంపకూడదు, గ్రహణం రోజు కొత్త పనులు ప్రారంభించవద్దు, అలాగే మద్యం మాంసం తీసుకోకూడదు.