జనవరి 1నుంచి బ్యాంకుల విషయంలో చెక్కుల చెల్లింపులకి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇకపై రూ. 50,000కు మించిన చెక్కుల చెల్లింపుల విషయంలో బ్యాంకులు కొన్ని కీలక అంశాలను చూడాల్సి ఉంటుంది. చెక్ ఏదైతే క్లియరెన్స్ కోసం వచ్చిందో దానిని మళ్లీ పున సమీక్షించాల్సి ఉంటుంది.
చెక్కు సంఖ్య, తేదీ, చెల్లింపుదారుడి పేరు, ఖాతా నంబర్, చెల్లించవలసిన మొత్తం వంటి అంశాలను పునఃసమీక్షించవలసి ఉంటుంది. ఇలాంటివి చేయడం వల్ల ఎలాంటి మోసపూరిత లావాదేవీలు జరగవు, ఆర్బీఐ పాజిటివ్ పే వ్యవస్థను తీసుకువస్తోంది, ఇది కేవలం 50 వేలకు మించి ఉన్న లావాదేవీలకు చేయనున్నారు.
ఇక ఆ చెక్ క్లియరెన్స్ గురించి ఇటు ఇద్దరు ఖాతాదారులకు వెంటనే సమాచారం ఇస్తారు, ఇక సుమారు ఐదు లక్షల రూపాయల వరకూ చెక్స్ ఇచ్చే వాటికి ఖాతాదారుడి ఇష్టం మేరకు దీనిని అమలు చేసే ఆలోచన చేస్తున్నారు, ఇక ఐదు లక్షలు దాటితే మాత్రం కచ్చితంగా దీనిని అమలు చేస్తారు.