కొణిదెల చిరంజీవి మెగా స్టార్.. ఆయన నుంచి వారి కుటుంబంలో చాలా మంది చిత్ర సీమలోకి అడుగు పెట్టారు, అయితే వారి టాలెంట్ తో మంచి హీరోలుగా నిలదొక్కుకున్నారు, ఇక పవన్ కల్యాణ్, నాగబాబు, బన్నీ రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా మంది ఉన్నారు, అయితే ముఖ్యంగా హీరోయిన్ గా మెగా కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చింది మెగా డాటర్ నిహారిక మాత్రమే , మరి నాగబాబు కుమార్తె నిహారిక రియల్ స్టోరీ చూద్దాం.
నిహారిక కొణిదెల మన తెలుగు తనం తన మాటల్లో కనిపిస్తుంది, మాటల్లో చతురత , అందరితో చలాకీ గా మాట్లాడుతుంది, అందుకే మనకు బాగా దగ్గర అయింది కొణిదెల వారి డాటర్, ఇక బుల్లితెరపై వెండి తెరపై కూడా సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ…18 డిసెంబర్ 1993 న నాగబాబు పద్మజలకు రెండో సంతానంగా నిహారిక పుట్టింది.. ఆమె అన్న నటుడు హీరో వరుణ్ తేజ్.
ఆమెకు చిన్న తనం నుంచి నటన అంటే ఇంట్రస్ట్, ఇక ఆమె చదువు అంతా హైదరాబాద్ లోనే జరిగింది,
సెంటిమేరిస్ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ లో గ్రాడ్యువేషన్ చేసింది..చదువుతోనే నటన ప్రొడక్షన్ వైపు వెళ్లింది.ఢీ జూనియర్ 1-2 కి యాంకర్ గా అదరగొట్టింది నిహారిక, ఈ సమయంలో బుల్లితెరపై చేస్తూనే ఇటు మరో పక్క వెబ్ సిరీస్ చేసింది నిహారిక
ముద్ద పప్పు ఆవకాయ లో ఆమె నటన అమోఘం అనే చెప్పాలి, అంతేకాదు ఈ వెబ్ సిరీస్ నిర్మాతగా చేసింది…
నాన్న కూచి అనే వెబ్ సిరీస్ లో చేసింది తన తండ్రి నాగబాబుతో., తర్వాత వెండి తెరపై 2016లో ఒక మనసు చిత్రం చేసింది, ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా చేశారు. తర్వాత ఓరునల్ల నారుపాతం అనే సినిమాలో తమిళ్ లో నటించింది.
ఆ తర్వాత వరుసగా హ్యాపీ వెడ్డింగ్..సూర్య కాంతం సినిమాలు చేసింది. ఇక డిసెంబర్ 9న జొన్నలగడ్డ చైతన్య అనే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని వివాహం చేసుకుంది పెద్దల సమక్షంలో నిహారిక.