తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఇక వచ్చే వారం ఫైనల్, అయితే ఈ వారం ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వబోతున్నారు, మరి అఖిల్ మినహా మిగిలిన అందరూ కూడా హౌస్ లో నామినేట్ అయ్యారు, మరి ప్రజలు ఎవరిని హౌస్ లో ఉంచుతారో క్లారిటీ రానుంది మరికొన్ని గంటల్లో. అయితే గత వారం హౌస్ నుంచి జబర్ధస్త్ అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు, ఇప్పుడు పలు ఇంటర్వ్యూలతో అవినాష్ బిజీగా ఉన్నాడు.
ఈ సమయంలో బిగ్ బాస్ హౌస్ లో దాదాపు 13 వారాలు అందరిని నవ్వించాడు అవినాష్ , ఇక అవినాష్ కామెడీకి ఇటు నాగార్జున కూడా చాలా సమయాల్లో నవ్వుకున్నారు, అయితే తాజాగా మన్మథుడు నాగార్జున అవినాష్ కి అదరిపోయే గిఫ్ట్ ఇచ్చారట.
ఎంటర్ టైనర్ ఆఫ్ హౌజ్ అంటూ బిరుదు ఇప్పటికే అవినాష్ కు ఇచ్చేసాడు కింగ్ అక్కినేని నాగార్జున. అవినాష్ ఎలిమినేట్ అయిన తర్వాత ఆయన ఇంటికి నాగార్జున నుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది. అప్పట్లో ఓ వీకెండ్ సమయంలో నాగ్ వేసుకున్న షర్ట్ అదిరిపోవడంతో మీ షర్ట్ బాగుంది అన్నాడు అవినాష్, దీంతో ఆ విషయం గుర్తు ఉంచుకున్ననాగార్జున అవినాష్ కోసం ప్రత్యేకంగా ఈ షర్ట్ అతని ఇంటికి పంపించారట, ఆ షర్ట్ వేసుకుని నాగార్జున గారికి థాంక్స్ చెప్పాడు మన కమెడియన్ అవినాష్.