ప్రభాస్ బాహుబలి చిత్రంతో ఎంతో మంచి పేరు వరల్డ్ వైడ్ గా సంపాదించుకున్నాడు, ఇక నేరుగా అన్నీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు ప్రభాస్, అయితే ప్రభాస్ ఇప్పుడు మూడు సినిమాలు ఒకే చేశారు.. మూడు చిత్రాలు కూడా పాన్ ఇండియా చిత్రాలే.. ఇక దర్శకులు నిర్మాతలు ఆయన డేట్స్ కోసం క్యూ కడుతున్నారు.. 2022 వరకూ ప్రభాస్ ఫుల్ బిజీ అనే చెప్పాలి.
ఇక రాధేశ్యామ్ సినిమా దాదాపుగా ముగిసింది. తరువాత ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చేస్తున్నారు. మరో దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఇక కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను అని ప్రకటన చేశారు, ఈ సినిమా పేరు వచ్చేసింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నారు, అయితే ఈ సినిమాలో చాలా మంది సీనియర్ నటులు నటించే అవకాశం ఉంది.. అంతేకాదు కన్నడ తమిళ తెలుగు బాలీవుడ్ నటులు నటించే అవకాశం ఉంది,మోహన్ లాల్ , రానా కూడా ఈ చిత్రంలో నటించే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి, అయితే ఇంకా చర్చలు జరుగుతున్నాయట.