ప్రిన్స్ మహేశ్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మంచి హిట్ సాధించారు, ఇక సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు మహేష్ ..త్వరలో అమెరికాలో చిత్ర షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది, ఓపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క మల్టీప్లెక్స్ నిర్వహణ చూసుకుంటున్నారు మహేష్ బాబు, అంతేకాదు ఆయన సినిమా నిర్మాణం పై కూడా ఫోకస్ చేశారు.
ఇప్పటికే హీరో అడవి శేష్ హీరోగా మేజర్ అనే చిత్రాన్ని చేస్తున్నారు, ఈ సినిమాకి శశికిరణ తిక్క దర్శకుడు.. ఇక 2021 ప్రధమార్దంలో ఈ సినిమా విడుదల కానుంది, తాజాగా మరో సినిమాని కూడా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారట ప్రిన్స్.
జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై హీరో నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి… టాలీవుడ్ లో ఏజంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ సినిమా ద్వారా నవీన్ మంచి ఫేమ్ సంపాదించుకున్నారు, ఇక ఈ సినిమా చర్చల్లో ఉందట ..ఇంకా దర్శకుడు ఎవరు అనేది తెలియలేదు, సో దీనిపై త్వరలో ఓ క్లారిటీ రానుందట.