దర్శకుడు శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ సినిమా టాలీవుడ్ లో సూపర్ హిట్ చిత్రాలలో కచ్చితంగా ఉంటుంది, స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది స్నేహం ఇలాంటి కథతో అద్బుతమైన స్టోరీగా వెండి తెరపై వచ్చింది, ఇందులో నటించిన వారికి తర్వాత పలు సినిమాల్లో మంచి పాత్రలు వచ్చాయి, పలువురు హీరోలుగా మారారు టాలీవుడ్ లో, ఇక కొత్త వాళ్ళతో సినిమా తీసి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ సృష్టించారు.
2007 వ సంవత్సరం లో హ్యాపీ డేస్ అనే సినిమా ఆ ఏడాది సూపర్ హిట్ అయింది, అయితే ఇందులో నటించిన అప్పు పాత్ర మాత్రం ఎవరూ మర్చిపోలేరు..ఈ సినిమా లో నిఖిల్ కి జోడిగా గాయత్రి రావు అలియాస్ అప్పు నటించింది, ఇక తర్వాత ఆమె వెండితెరపై పలు సినిమాల్లో కనిపించింది. ముఖ్యంగా ఆరెంజ్ చిత్రం అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో కూడా మంచి రోల్స్ చేసింది.
ఇక తర్వాత సినిమాల్లో కనిపించలేదు ..గత ఏడాది పెళ్లి చేసుకున్న గాయత్రీ రావు ఇప్పుడు చెన్నై లో స్థిరపడిపోయింది, ఇక మంచి పాత్రలు వస్తే నటించడానికి రెడీ అంటోంది ఆమె, ఇక ఆమె కుటుంబం సినిమా రంగానికి చెందిన వారే.. ఆమె తల్లిపేరు పద్మ మరియు తండ్రి పేరు అరుణ్ కుమార్, ఆమె తల్లి పద్మ పలు సీరియల్స్ లో నటిస్తున్నారు, టాలీవుడ్ లో ఎంతో కాలంగా వర్క్ చేస్తున్నారు. ఇక గాయత్రీరావు మొత్తం ఏడు చిత్రాల్లో నటించింది.