నందమూరి నటసింహం బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో బీబీ3 సినిమా తెరకెక్కుతోంది.. ఇంకా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేయలేదు.. ఇటు అభిమానులు కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, అయితే ఈ సినిమా గురించి హీరోయిన్ గా పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి, అయితే ఇంకా ఎవరిని ఫైనల్ చేశారు అనేది తెలియలేదు, తాజాగా ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ తర్వాత వారణాసిలో కూడా ఉంటుంది అని తెలుస్తోంది, అయితే అంతకు ముందు రాయలసీమలో ప్లాన్ చేస్తున్నారట..చిత్రయూనిట్ కర్నూలులోని నంద్యాలకు వెళ్లనుందట. నంద్యాల పరిసర ప్రాంతాలలో కీలక యాక్షన్ సీన్లను షూట్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు, ఇక బాలయ్య ఇక్కడ పది రోజులు షూటింగులో పాల్గొంటారు అని తెలుస్తోంది.
ప్రగ్యా జైశ్వాల్ ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. ఇక సినిమాలో విలన్ పై క్లారిటీ రాలేదు, మరో హీరోయిన్ కూడా ఉండే అవకాశం ఉంది అని తెలుస్తోంది, ఇంకా చిత్ర యూనిట్ నుంచి ఏ ప్రకటన రాలేదు.