1500 కోట్ల బడ్జెట్ సినిమాకి త్రివిక్రమ్ మాటలు

-

మాటల మాంత్రికుడిగా పేరుతెచ్చుకున్న ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా ఎన్టీఆర్ సినిమాకి కథలో బిజీగా ఉన్నారు, ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఆయన ఈ చిత్రం చేయనున్నారు, ఇక వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం కానుంది. ఇక ఆయన రాసే డైలాగుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇటు సినిమాలో మాటలు నిజ జీవితంలో మనకు దగ్గరగా ఉండేలా ఉంటాయి.. అందుకే ఆయన మాటల మాంత్రికుడిగా మారారు.

- Advertisement -

తాజాగా ఆయన లాక్ డౌన్ సమయంలో ఓ కథకి మాటలు రాసిచ్చారు అని తెలుస్తోంది.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తాము రామాయణాన్ని తెరకెక్కిస్తున్నట్టు మూడేళ్ల క్రితం చెప్పారు, అయితే నమిత్ మల్హోత్రా, మధు వంతెన కూడా భాగస్వాములు అవుతారని ఆయన తెలిపారు, ఈ సినిమా దాదాపు 1500 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవనుంది, ఇక సిరీస్ లుగా ఈ రామాయణం రానుంది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి త్రివిక్రమ్ ఆయన సంభాషణలు రాయడం పూర్తిచేసినట్టు చెబుతున్నారు. అల్లు అరవింద్ కోరడంతో ఆయన ఈ మాటలు రాసిచ్చినట్లు తెలుస్తోంది, ఇక లాక్ డౌన్ సమయంలో మాటలు రాసిచ్చినట్లు తెలుస్తోంది, ఇక తెలుగు, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో త్రీడీ ఫార్మాట్ లో నిర్మించనున్నారు, ఈ సినిమాకి దర్శకత్వం
దంగల్ ఫేమ్ నితీశ్ తివారీ, మామ్ ఫేమ్ రవి ఉద్యావర్ చేయనున్నారు, దేశంలో ఉన్న చాలా మంది నటులు ఇందులో నటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...