బిర్యానీ లవర్స్కు డోమినోస్ గుడ్ న్యూస్ @ రూ 99

-

బిర్యానీ చాలా మందికి ఫేవరట్ ఫుడ్, ఏదైనా కొత్త ప్లేస్ కు వెళ్లినా అక్కడ ఆ ప్లేవర్ బిర్యానీ తింటారు, ఇక హైదరాబాద్ అంటే ముందు వినిపించేది దమ్ బిర్యానీయే.. ఇలా చాలా మంది బిర్యానీ అంటే ఇష్టపడుతూ ఉంటారు, ఇప్పుడు చిన్న హోటల్స్ నుంచి పెద్ద హోటల్స్ వరకూ బీర్యానీని పలు రకాలుగా అందిస్తున్నాయి, పలు ఆఫర్లు ఇస్తున్నాయి, ఇక ఆన్ లైన్ లో హోమ్ డెలివరీ చేస్తున్నాయి.

- Advertisement -

తాజాగా పిజ్జాలో ఫేమస్ అయిన డోమినోస్ ఇకపై బిర్యానీ మార్కెట్లోకి ఎంటర్ అవుతోంది. ఇక పలు రకాల బిర్యానీలు అందించేందుకు సిద్దం అయింది, డోమినోస్ పేరుతో పిజ్జాలను అందించే జూబిలెంట్ ఫుడ్ వర్స్క్ లిమిటెడ్ సంస్థ తాజాగా ఈ ప్రకటన చేసింది. ఏక్ దమ్ పేరుతో బిర్యానీలను మన దేశ మార్కెట్లో అందించనుంది.

మొత్తం 20 రకాల బిర్యానీలకు అందించనుంది..హైదరాబాదీ నిజామీ బిర్యానీ, లక్నో నవాబీ బిర్యానీ, కోల్ కతా బిర్యానీ, బట్టర్ చికెన్ బిర్యానీ లాంటి రకరకాల బిర్యానీలను ఫుడ్ లవర్స్ కోసం అందించనుంది. ఇక డిఫరెంట్ రుచులు అందివ్వనుంది, కబాబ్స్, కర్రీస్ బ్రెడ్ రైతాలు కూడా ఇవ్వనుంది.

ఇక బిర్యానీ 99 రూపాయల నుంచి స్టార్ట్ కానుందట. ఇక జేఎఫ్ఎల్ కంపెనీ నోయిడా కేంద్రంగా పనిచేస్తుంది. ఏక్ దమ్ పేరుతో అందించే బిర్యానీలను గురుగ్రామ్లోని మూడు రెస్టారెంట్లలో మొదటగా ప్రారంభిస్తుంది. తర్వాత ఢిల్లీలో స్టార్ట్ చేయనున్నారు,ఇక యాప్ వెబ్ సైట్ లో దీని కోసం డీటెయిల్స్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | వైసీపీ ప్రతిపక్ష హోదా పై డిప్యూటీ సీఎం రియాక్షన్

వైసీపీ కోరుతున్న ప్రతిపక్ష హోదాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan...

AP Assembly | మొదలైన ఏపీ అసెంబ్లీ.. జగన్ @ 11 నిమిషాలే..!

AP Assembly | ఏపీ బడ్జెట్ 2025 - 26 సమావేశాలు...