డయాబెటిస్ సమస్య చాలా మందిని వేధిస్తోంది, అందుకే చాలా మంది సాయంత్రం పూట అన్నం తినడం మానేస్తున్నారు, అయితే రోటీలు చపాతీలు తింటున్నారు, ముఖ్యంగా మైదా, హోల్ వీట్ కూడా అతిగా తినకూడదు, ఇక చపాతీ పిండి అంటే గోదుమ పిండి.. దీని వాడకం కూడా బాగా పెరుగుతోంది, ఇది ప్రాసెస్ చేసిన ప్యాకింగ్ పిండి కాకుండా గోదుమలు మర పట్టిస్తే మంచిది.
రెగ్యులర్ గా వాడే పిండితో పాటు సజ్జలు, రాగులు, జొన్నలు పిండి కలిపి చేసుకుంటే ఇది మల్టీ గ్రెయిన్ అవుతుంది, ఇది మరింత టేస్ట్ ఉంటుంది, అంతేకాదు ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నిపుణులు. ఇక్కడ ఓ విషయం తెలుసుకోండి సజ్జలు, జొన్నల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి అరగడానికి చాలా టైమ్ తీసుకుంటాయి, బ్లడ్ లోకి షుగర్ రిలీజ్ కూడా స్లోగా జరుగుతుంది. సో అందుకే షుగర్ పెద్దగా పెరగదు…దీని వల్ల ఇవి కూడా రాత్రి రెండు లేదా మూడు మీకు నచ్చిన కర్రీతో తీసుకుంటే మంచి రుచి ఆరోగ్యకరం.
గమనిక..
అయితే కడుపు నొప్పి, అతిగా షుగర్ సమస్య, కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా అడిగి ఈ రోటీలు చేసుకోవాలి, ఏ అనారోగ్య సమస్యలు లేని వారికి మాత్రమే ఇది బెటర్, లేదా కడుపు నొప్పి సమస్యలు రావచ్చు.